హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో ఢిల్లీలోని న్యూఢిల్లీ కన్వెన్షన్ సెంటర్లో పలువురు ఎంపీలకు లోక్మత్ మీడియా సంస్థ మంగళవారం అవార్డులను ప్రదానం చేసింది. అంతకుముందు లోక్మత్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, పార్టీ ఎంపీలు సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డి, బీబీ పాటిల్ తదితరులు హాజరయ్యారు.
సదస్సు అనంతరం వివిధ క్యాటగిరీల్లో పలువురు పార్లమెంటేరియన్స్కు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లోకమత్ సంస్థ తరఫున 2022 సంవత్సరానికి గాను అవార్డులను అందజేశారు. జ్ఞాపికలు అందించి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు మల్లికార్జున ఖర్గే, మురళీమనోహర్ జోషి, శరద్‌పవార్, సీతారాం ఏచూరి అతిథులుగా పాల్గొన్నారు.