హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగా ణ): తొమ్మిది జిల్లాల్లో నిలిచిపోయిన మాడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్ల (జూన్) జీతాలు వెంట నే చెల్లించాలని మాడల్ స్కూల్ టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) సంఘం రాష్ట్ర నా యకులు ప్రకటన విడుదలచేశారు.
ఈ నెల 8న కొన్ని జిల్లాలకు మాత్రమే వేతనాలు ఇచ్చార ని, సిద్దిపేట, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, వనప ర్తి, పెద్దపల్లిలో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు అందకపోవడం బాధాకరమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు తెలిపారు.