హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై కేంద్రంతో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బృందం ఢిల్లీకి బయలుదేరింది. ఈ బృందంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు ఉన్నారు.
ఈ క్రమంలో అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వానాకాలం ధాన్యానికి సంబంధించి అదనపు ధాన్యం సేకరణపై ఇప్పటి వరకు ఎలాంటి ఆమోదం, నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో మరోసారి మాట్లాడాలని నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో ప్రధాని, కేంద్రమంత్రితో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.