హనుమకొండ సబర్బన్/ఎల్కతుర్తి/భీమదేవరపల్లి:రాష్ట్రంలో పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కా ర్ కొర్రీలు పెట్టడాన్ని మానుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం హనుమకొండ జి ల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దండేపల్లిలో ఆయిల్‌పామ్ మొక్కలు నా టే కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.
నూనెల విని యోగం పెరిగి, ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్తగా ప్రభు త్వం పామాయిల్ తోటల సాగుకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఈ సాగుతో 30 ఏండ్ల పాటు ఎకరానికి లక్ష చొప్పున రైతులకు ఆదాయం వస్తుందని చెప్పా రు. భీమదేవరపల్లిలోని వంగరలో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కావేరి సీడ్స్ అధినేత గుండవరపు భాస్కర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమ కోసం ఆలోచించే వ్యక్తి అని కొనియాడారు.