Weather Update | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగండ్ల వాన కురిసింది. మరోవైపు రాష్ట్రంలో వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండ, వాన, చలి అన్నట్టుగా కలగలిసిన వాతావరణం కనిపిస్తున్నది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమశాతం పెరిగి అక్కడక్కడ క్యుమిలోనిబంస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. మేఘాలు చల్లబడి గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నా యి. దీంతో పలు జిల్లాల్లో శనివారం వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.