పటాన్చెరు, జూలై 23: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరిట ఓ వ్యక్తి కోటి రూపాయలు మోసపోయాడు. ఈ ఘట న మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వెలుగుచూసింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని నాడియ కామి అనే మహిళ అకౌంట్ నుంచి పటాన్చెరు పోలీస్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాండీయో గేటెడ్ కమ్యూనిటీలో నివాసముండే బెజవాడ నాగార్జున (36)కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో నాగార్జున రూ.99.78 లక్షలు ఆమె చెప్పిన విధంగా ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత మోసపోయానని గ్రహించిన ఆయన 1930 నంబర్‌కు ఫోన్ చేసి, పటాన్చెరు పోలీసులను ఆశ్రయించాడు. తక్షణమే పోలీసులు ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లను తనిఖీ చేసి రూ.34 లక్షలు ఉన్నట్టు గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్ చేయించారని పటాన్చెరు సీఐ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.