Lok Sabha Elections | హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితం సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. తొలి ఫలితం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో కేవలం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్ నియోజకవర్గాల ఫలితాలు చివరలో వెలువడే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాల్లో 24 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మొత్తానికి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
ఆదిలాబాద్ – 23
పెద్దపల్లి – 21
కరీంనగర్ – 24
నిజామాబాద్ – 15
జహీరాబాద్ – 23
మెదక్ – 23
మల్కాజ్గిరి – 21
సికింద్రాబాద్ – 20
హైదరాబాద్ – 24
చేవెళ్ల – 23
మహబూబ్నగర్ – 21
నాగర్కర్నూల్ – 22
నల్లగొండ – 24
భువనగిరి – 23
వరంగల్ – 18
మహబూబాబాద్ – 22
ఖమ్మం – 21