హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండో దశలో కార్పొరేషన్లతోపాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థల కు (యూఎల్బీ) వచ్చే డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యో చిస్తున్నది. మున్సిపల్ పాలకమండళ్ల కాలపరిమితి ముగియడం, ఎన్నికలు త్వరితగతిన నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. రెండోదశ పురపాలక ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కాంగ్రెస్‌వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అక్టోబర్ నాటికి పూర్తికానున్నది.
ఎన్నికల ఏర్పాట్ల సన్నాహాలకు నెల సమయం ఇచ్చి డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లాలని పావులు కదుపుతున్నట్టు తెలిసింది. డిసెంబర్లో రెండో దఫా పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నందున సిద్ధంగా ఉండాలని, ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు పార్టీ శ్రేణులకు తాజాగా జరిగిన అంతర్గత సమావేశాల్లో సూచించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాలపరిమితి ముగిసిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. అయితే, అప్పటికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలకవర్గ కాలపరిమితి ముగియనందున ఎన్నికలు నిర్వహించలేదు.
జీహెచ్ఎంసీతోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగలేదు. కాలపరిమితి ముగియకపోవడంతోపాటు కోర్టు కేసులు ఇతర కారణాలతో మందమర్రి, మణుగూరు, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు నిర్వహించలేదు. కొన్ని డివిజన్లలో కూడా ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. అయితే, ఉమ్మడిగా ఉన్న జీహెచ్ఎంసీని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. వాస్తవానికి కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ‘సర్’ ప్రక్రియ వల్ల మరికొంత ఆలస్యమైంది. ఇంకా ఆలస్యమైతే మొదటికే మోసం వస్తుందనే భయంతో కాంగ్రెస్‌వర్గాలు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలిసింది.
డిసెంబర్లోనే ఎందుకు?
ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న ‘సర్’ ప్రక్రియ అక్టోబర్ 19 నాటికి పూర్తికానున్నది. ఒకవేళ క్లెయిమ్స్, ఆబ్జెక్షన్స్, పరిష్కారాలకు గడువు పెంచినా అక్టోబర్ 31 నాటికి ‘సర్’ ముగియనున్నది. రాష్ట్రంలో తుది ఓటరు జాబితా వెలువడనున్నది. కొత్త ఓటరు జాబితా ఆధారంగానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనాకాలం దాదాపు సగం పూర్తయినా, హామీలు అమలుచేయడం లేదని అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సాగునీరు, యూరియా, కరెంట్ సక్రమంగా అందడం లేదని రైతులు, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగులు, తులం బంగారం, నెలకు రూ.2,500, స్కూటీలు ఇవ్వడం లేదని మహిళలు, చేయూత పింఛన్ల మొత్తం పెంచడం లేదని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు..
ఇలా అన్ని వర్గాల ప్రజలు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డిసెంబర్ నాటికి ఎండలు, వర్షాల తీవ్రత తగ్గడంతోపాటు తాగునీరు, విద్యుత్తు సమస్యలు తకువగా ఉంటాయని, ప్రజల ఆగ్రహం తీవ్రత కూడా తగ్గుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు నిర్వహించకపోతే, కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. గ్రామ పంచాయతీల ఎన్నికలు ఏడాది ఆలస్యంగా నిర్వహించడం వల్ల పల్లెలు నిధుల లేమితో సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. పట్టణసంస్థలకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే డిసెంబర్ అనువైన సమయమని యోచిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ వర్గాలు, అధికారులు ఎన్నికల నిర్వహణ దిశగా కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిసింది.
పురపోరు తర్వాత పరిషత్ ఎన్నికలు
రాష్ట్రంలో రెండో దశ పుర పాలక ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు కూడా వెళ్లాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లిన తరహాలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సూచనలు చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, మేడ్చల్ మినహాయించి రాష్ట్రంలోని 31 జిల్లా పరిషత్‌లు, 565 మండల పరిషత్‌లకు ఒకేదఫాలో ఎన్నికలు జరుపాలని యోచిస్తున్నది.
ఎన్నికలు జరుగాల్సిన