Realtor Suicide : రాజకీయ నాయకుల వేధింపులు తాళలేక హోమ్ ల్యాండ్ అధినేత, ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. స్వగ్రామం నేదునూరులోని ఫామ్ హౌస్లో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పఠాన్ చెరులో 250 ఎకరాల్లో నూతన వెంచర్ చేస్తున్న రాంరెడ్డి ఆత్మహత్యకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది.
హోమ్ ల్యాండ్ అధినేత బనలా రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని స్వగ్రామం నేదునూరులోని ఫామ్ హౌస్లో ఊరి వేసుకొని ఆయన మరణించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న కందుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాం రెడ్డి హైదరాబాద్ మణికొండలో నివసించేవారు. పఠాన్ చెరులో 250 ఎకరాల్లో వెంచ్ భూమి వివాదం, అప్పులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనైన ఆయన సూసైడ్ చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజకీయ నాయకుల వేధింపులు తాళలేక ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య
తన స్వగ్రామం నేదునూరులోని ఫామ్ హౌస్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హోమ్ ల్యాండ్ అధినేత రాంరెడ్డి
పఠాన్ చెరులో 250 ఎకరాల్లో నూతన వెంచర్ చేస్తున్న రాంరెడ్డి
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది pic.twitter.com/bXKVLgndoe
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026