Ahmedabad | విమానంలో బాంబు బెదిరింపు నోట్.. అత్యవసరంగా అహ్మదాబాద్‌లో ల్యాండింగ్
Ahmedabad : గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక బాంబు బెదిరింపు నోట్ కనిపించడంతో అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన లక్నో నుంచి డమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో, గురువారం సాయంత్రం జరిగింది.
Ahmedabad : గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక బాంబు బెదిరింపు నోట్ కనిపించడంతో అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన లక్నో నుంచి డమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో, గురువారం సాయంత్రం జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 6ఈ 97 పేరుగల ఇండిగో విమానం గురువారం సాయంత్రం 4.17 గంటలకు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ పట్టణానికి బయల్దేరింది.
అయితే, విమానం గాలిలో ప్రయాణిస్తుండగా.. విమానంలో ఒక టిష్యూ పేపర్‌పై బాంబ్ అని రాసి ఉంది. దీంతో కంగారు పడిన విమాన సిబ్బంది.. ఏటీసీకి సమాచారం అందించారు. వారు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించారు. దీంతో విమానాన్ని సాయంత్రం 5.43 గంటలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 107 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికుల్ని, సిబ్బందిని భద్రతా సిబ్బంది బయటకు దింపేశారు. విమానాన్ని దూరంగా టెర్మినల్ 2కు తరలించారు.
సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం విమానంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎస్‌వోజీ, సీఐఎస్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసుల కూడా విమానంలో తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి బాంబు, పేలుడు పదార్థాలు లేవని అధికారులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. గత నెల 31న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దమ్మామ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానంలోని టిష్యూ పేపర్‌పై కూడా బాంబ్ అని రాసి ఉండటంతో అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం ఏ బాంబు లేదని తేల్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

