INDW vs BANW : మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత ఓపెనర్ షఫాలీ వర్మ(64) దంచేసింది. స్మృతి మంధాన(2) విఫలమైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన షఫాలీ బంగ్లాదేశ్ బౌలర్లను హడలెత్తించింది. కానీ, మిడిలార్డర్ నుంచి ఆమెకు సహకారం అందలేదు. వరసగా నిరాశపరుస్తున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(24 నాటౌట్) రీచా ఘోష్(21), ప్రతీకా రావల్(20)లు రాణించినా టీమిండియా 150లోపే పరిమితమైంది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో షఫాలీ వర్మ(64) చెలరేగింది. ఫోర్లు, సిక్సర్లతో బంగ్లాదేశ్ బౌలర్లను బెంబేలెత్తించిన షఫాలీ భారీ స్కోర్‌కు పునాది వేసింది. కానీ, బంగ్లా స్పిన్నర్లను మిడిలార్డర్ ధీటుగా ఎదుర్కోలేకపోయింది. రీచా ఘోష్(21) నిరాశపరిచినా ఆఖర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(24 నాటౌట్), దీప్తి శర్మ(13 నాటౌట్) ధనాధన్ ఆడారు. దాంతో, టీమిండియా నిర్ణీత ఓవర్లలో 149 పరుగులు చేసింది.
Innings Break!
Shafali Verma’s brisk half-century guides #TeamIndia to a commendable total in the Semi-Final 👏👏
Over to our bowlers 🙌
Scorecard ▶️ https://t.co/6OyMx9q1ih#WomensAsiaCup | #INDvBAN pic.twitter.com/jSbUpawmXv
— BCCI Women (@BCCIWomen) September 10, 2026
టాస్ ఓడిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(2)ను సుల్తానా ఖాతూన్(2-30) ఔట్ చేయడంతో 9 పరుగులకే తొలి వికెట్ పడింది. అనంతరం ప్రతీకా రావల్(20) జతగా స్కోర్‌బోర్డును ఉరికించింది షఫాలీ. పవర్ ప్లేలో దంచేసిన తను.. బంగ్లా బౌలర్లను ఒత్తిడిలో పడేసింది. ప్రతీక ఔటయ్యాక కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిందీ ఓపెనర్. 40 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన షఫాలీని సుల్తానా ఔట్ చేసింది. రీచా ఘోష్ విఫలమైనా.. దీప్తి శర్, కౌర్‌లు ధనాధన్ ఆడారు. వీరిద్దరి పోరాటంతో టీమిండియా 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగలిగింది.