Jagdish Reddy : తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరీకి పాల్పడుతోందని, కేసీఆర్ ఇంటి మీద దాడికి వేలాదిమందిని రేవంత్ రెడ్డి పంపాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagdish Reddy) మండిప్డారు. అసెంబ్లీ వద్ద పోలీసులు చేసిన దాడిపై మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసేందుకు మహిళా ఎమ్మెల్యేలతో కలిసి ఆయన గురువారం ఢిల్లీకి వెళ్లారు.
మహిళా ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్తున్న తమను రాష్ట్ర పోలీసులే అడ్డగించి దాడి చేశారని, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. కేసీఆర్ ఇంటి మీదకు దాడి చేయడానికి రేవంత్ రెడ్డే పోలీస్ ఎస్కార్ట్‌ను ఇచ్చి వేలాది మంది గూండాలను పంపించాడని ఆయన ధ్వజమెత్తారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్( AI) జనరేటెడ్ ఫోటోలను చేసి తమ నాయకుల మీద 4 కేసులు పెట్టారని తెలిపిన జగదీశ్ రెడ్డి.. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసి తిరిగి వారి మీదనే కేసులు పెట్టారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి అరాచకాలకు సంబంధించి మానవ హక్కుల కమిషన్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వచ్చామని మాజీ మంత్రి పేర్కొన్నారు.
అసెంబ్లీ వద్ద పోలీసులు చేసిన దాడిపై ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసేందుకు మహిళా ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లిన జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు
తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరికి పాల్పడుతోంది
అసెంబ్లీకి వెళ్తున్న మమ్మల్ని రాష్ట్ర పోలీసులే అడ్డగించి… https://t.co/Lj1hd6mWym pic.twitter.com/iOhTX72DTm
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026