Telangana Assembly | తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా పడింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సంతాప తీర్మానం ప్రకటించి, మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీర్లకు మండలి నివాళులర్పించి సంతాపం తెలిపింది.
సమావేశాల్లో భాగంగా పలు ఆర్డినెన్స్‌లు, డాక్యుమెంట్లను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు మండలిలో ప్రవేశపెట్టారు. అనంతరం మండలి సమావేశాలను జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు.