Telangana Journalists | న్యూఢిల్లీ : తెలంగాణలో ప్రజా సమస్యలపై ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూ.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో జర్నలిస్టులపై దాడులు ఆపాలంటూ.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తెలంగాణ స్వతంత్ర జర్నలిస్టులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు నిరసనకు దిగారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వతంత్ర జర్నలిస్టులను చంపేందుకు యత్నిస్తుందని బాధిత జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తమతో పాటు తమ కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదకరస్థితిలో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను రాహుల్ గాంధీకి చెప్పేందుకు ఢిల్లీలోని ఆయన నివాసానికి బాధిత జర్నలిస్టులు వెళ్లారు. జర్నలిస్టులకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న ఏఐసీసీ కార్యాలయానికి జర్నలిస్టులు వెళ్లారు.
ఇక నిరుద్యోగుల సమస్యలపై ఓయూలో కవరేజ్‌కు వెళ్లిన ఓ జర్నలిస్టుపై పోలీసులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. రుణమాఫీపై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులతో పాటు ఇతర జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడి, అసభ్యకరంగా ప్రవర్తించారు. చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జర్నలిస్టుల వాహనాలను వెంబడించి, భయానక వాతావరణం సృష్టించారు. కాంగ్రెస్ కార్యకర్తల గుండాయింజపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి.
తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను రాహుల్ గాంధీకి చెప్పేందుకు ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిన తెలంగాణ జర్నలిస్టులు
జర్నలిస్టులకు అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ.
రాహుల్ గాంధీ కలవకపోవడంతో పక్కనే ఉన్న ఏఐసీసీ కార్యాలయంకు వెళ్లిన జర్నలిస్టులు.
అక్కడ తెలంగాణలో… pic.twitter.com/SZHRyJ108F
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2024
ఇవి కూడా చదవండి..
KTR | రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. కేటీఆర్ ట్వీట్
Anasuya Bharadwaj | బాబోయ్.. అనసూయ ట్రెండీ లుక్స్ చూస్తే పిచ్చెక్కిపోతారు
DSC 2008 | నిరసనలు వద్దు.. వచ్చి కలవండి.. డీఎస్సీ 2008 బాధితుల వినూత్న నిరసన