హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫొటోలు మార్ఫింగ్ చేసి ‘అరవింద్ అన్న ఆర్మీ’ అనే ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేసి సర్క్యూలేట్ చేశారని మేడ్చల్ జిల్లా జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లలితాయాదవ్ మండిపడ్డారు. ఇందుకు కారణమైన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకురాళ్లు వాసగొని శోభ, బండారి లావణ్య, స్వప్నరెడ్డి, సింగిరెడ్డి విమల, శ్రీలత, మహేశ్వరి, రత్న పెంటమ్మ తదితరులు ఉన్నారు.