హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 12,39,044 కేసులు పరిష్కారం కావడంతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సోమవారం వెల్లడించింది. 3వ జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 230 బెంచ్‌ల ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో 6,02,601 క్రిమినల్ కేసులు, 3,2 04 సివిల్ కేసులు, 6,33,239 ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని, బాధితులకు రూ.250.19 కోట్ల పరిహారం చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేశామని వివరించింది.