హైదరాబాద్ : దేశ తలసరి ఆదాయంలో తెలంగాణే నంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దేశ తలసరి ఆదాయంలో మనమే నెంబర్ వన్‌గా ఉన్నాం. సిక్కీం రాష్ట్రం మనకంటే చిన్నది. సిక్కీం జనాభే 6.60లక్షలు. జస్ట్ 0.1 శాతం మనకంటే ముందున్నది. ఇవన్నీ ఊరికే రాలే. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ సందర్భంలో మాట్లాడుతుంటే హెల్త్ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలని ఉంటే.. ఏ స్టేట్లలో బాగుండి ఇండియాలో.. బయట దేశాల్లో ఎక్కడ బాగుంది.. అంటే తమిళనాడుకు టీమ్‌ను పంపించాను.
సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఆమె ఆధ్వర్యంలో నలుగురు ఐఏఎస్‌లను నలుగురిని పంపిస్తే స్టడీ చేసి వచ్చి చెప్పారు. తమిళనాడుకు పోయిన సమయంలో ఐఎంఆర్, ఎంఎంఆర్‌లో తమిళనాడు బాగుందంటే వెళ్లాం. తాము గర్వానికి పోలేదు. ఎక్కడ బాగుంటే అక్కడ నేర్చుకునే ప్రయత్నం చేశాం. అక్కడి నుంచి తెచ్చుకొని అనేక పద్ధతుల్లో అమలు చేశాం. కేసీఆర్ కిట్‌ను ప్రారంభించాం. ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు పెంచాం. న్యూటిషన్ పెంచాం. వీటన్నింటి ఫలితంగా మూడు నాలుగు రోజుల కిందట నీతి ఆయోగ్ వెలువరించిన నివేదికలో మాతా మరణాల సంఖ్యలో తమిళనాడును మనం మించిపోయాం. తమిళనాడుకు వెళ్లిన సమయంలో మాతా మరణాల రేటు 92, తమిళనాడులో 79.. తాజాగా తమిళనాడులో 58 ఉంటే.. తెలంగాణలో 56 ఉంది’ అంటూ ఆరోగ్యశాఖను మంత్రి కేసీఆర్ అభినందించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ మూడు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఆ సంఖ్యను 33కు తీసుకెళ్తున్నామన్నారు. దాంతో పాటు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీలను ప్రతిచోట సైతం ఏర్పాటు చేయబోతున్నాం. విశ్వవిద్యాలయాలు అంతకు ముందు 13 ఉంటే.. ప్రైవేటు, ప్రభుత్వం కలిసి మరో 11 విశ్వవిద్యాలయాలను నెలకొల్పాం. ఆ విధంగా తెచ్చిన అప్పులను జాగ్రత్తగా.. ఒక్క రోజు డిపాల్ట్ లేకుండా రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ భాషలో చెప్పాలంటే పతార. పతార మంచిగుంటనే మనదిక్కు చూస్తరు. 40 సంవత్సరాల బాండ్లు కూడా
అమ్ముడుపోయే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ’ అన్నారు.