హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : వరి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువడం శుభపరిణామమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తీసుకొచ్చిన సాగు సంస్కరణలతోనే ఈ ఘనత దక్కిందని స్పష్టంచేశారు.
తాజాగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ 20 14-15 నుంచి 2024-25కు సంబంధించి విడుదల చేసిన నివేదికే సజీవ సా క్ష్యమని శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ ఏకంగా 240 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపారు.