హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. పదో తరగతి ఉత్తీర్ణులై ఇప్పటివరకు ఇప్పటి వరకు అడ్మిషన్ తీసుకోని విద్యార్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారి వసుంధర దేవి తెలిపారు.
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు టీసీ, రీ అడ్మిషన్ కూడా చేసుకోవచ్చని సూచించారు.