హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల (Inter Exams) తేదీలు ఖరారయ్యాయి. ఈ సారి ఫిబ్రవరి ఆఖర్లో పరీక్షలను నిర్వహించన్నారు. ఇప్పటి వరకు ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం ఫిబ్రవరి 25న పరీక్షలు ప్రారంభమై మార్చి 18న ముగియనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. ఫిబ్రవరి 25 నుంచి ఫస్ట్ ఇయర్, 26 నుంచి రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమయవుతాయి.
గతేడాది మార్చి5న ప్రారంభమైన పరీక్షలు 25న ముగిశాయి. ఈసారి 8 రోజులు ముందుగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9.50 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలు జనవరి ఆఖర్లో ప్రారంభించి ఫిబ్రవరి మొదటివారంలో పూర్తి చేయనున్నారు.