Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లు లేనట్టేనా..? జాగలు ఉన్నవారేకే డబ్బులు.. అసలు ఇల్లు ఎవరికస్తరు?
ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ‘గృహలక్ష్మి’ పథకానికే దాదాపు 15.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.
- జాగలు ఉన్నవారే 15.50 లక్షల మంది
- దరఖాస్తులు వచ్చాకే స్పష్టత వచ్చే అవకాశం
- ఇంకా సిద్ధంకాని ప్రభుత్వ మార్గదర్శకాలు
Indiramma Indlu | హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు లక్షల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ‘గృహలక్ష్మి’ పథకానికే దాదాపు 15.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం జాగ ఉన్నవారికి ఇంటి కోసం రూ.5 లక్షలు, జాగ లేనివారికి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో ఎన్ని దరఖాస్తులు వస్తాయో అనేది అంచనాకు దొరకడంలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ఎలా అనేదానిపై ఇంకా మార్గాదర్శకాలు కూడా సిద్ధం కాలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు సన్నాహాలు చేస్తున్నది.
ఇందులో ఇందిరమ్మ ఇండ్ల అంశం అత్యంత ప్రధానమైనదిగా చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం విధితమే. జాగలు ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకానికి బడ్జెట్లో రూ.12,000 కోట్లు కేటాయించిన గత సర్కారు, దరఖాస్తులు ఆహ్వానించగా, 15,58,610 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో సుమారు 11 లక్షల దరఖాస్తులకు అర్హతలున్నట్టు గుర్తించారు. ఇందులో దాదాపు 2 లక్షలకుపైగా మంజూరు పత్రాలను కూడా అందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడంతోపాటు జాగలు ఉన్నవారు, జాగలు లేనివారు అందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
సిద్ధంకాని మార్గదర్శకాలు
ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు ఇంకా సిద్ధంకాలేదు. ఇందిరమ్మ ఇల్లు కింద ఆర్థిక సాయం పొందేందుకు ఎంత జాగ ఉండాలి? ఇంటి జాగతోపాటు ఇంటికోసం ఆర్థిక సాయం పొందాలంటే ఉండాల్సిన అర్హతలేమిటి? ఇంటి జాగ ఒకచోట ఉండి, ఉద్యోగరీత్యా మరోచోట స్థిరపడినవారి పరిస్థితి ఏమిటి? లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేస్తారు? ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని మంజూరు చేస్తారు? జాగ లేనివారికోసం ఒకవేళ స్థానికంగా ప్రభుత్వ భూమి లేకుంటే.. భూసేకరణ చేస్తారా? తదితర అనేక అంశాలపై మార్గదర్శకాలు వచ్చాకే స్పష్టత వచ్చే అవకాశమున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

