హైదరాబాద్: హైకోర్టు (High Court) వెబ్‌సైట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా ఆన్లైన్ బెట్టింగ్ సైట్ తెరుచుకున్నది. పీడీఎఫ్ ఫైల్స్‌కు బదులుగా బీడీజీ స్లాట్ (BDG Slot) బెట్టింగ్ సైట్ వస్తున్నది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రీ ఫిర్యాదు చేశారు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్‌పై కేసు నమోదుచేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.