HYDRA | 1. హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని, స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు? అక్రమ కట్టడాలైనా చట్ట ప్రకారం చేయాలి కదా? నిర్మాణం జరిగిన 15-20 ఏండ్లకు హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అని కూల్చివేయటమేమిటి? పదేండ్లుగా ఇంటి పన్ను కట్టించుకొని.. ఇప్పుడు కూల్చివేస్తే ఆ వసూళ్లకు అర్థమేమిటి? ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం కాదా?
2. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉంటే నిబంధనల ప్రకారం నోటీసులు జారీచేసి.. చట్టప్రకారం అనుసరించాలి. విక్రయ దస్తావేజులు, నిర్మాణ అనుమతులు, ఇంటి పన్ను రశీదు.. మొదలైన వాటిని పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకోవాలి.
3. పిటిషనర్ ఫాంహౌజ్ ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు ప్రాథమిక, తుది నోటిఫికేషన్లు జారీచేసి ఉంటే అవి ఎప్పుడు జారీచేశారో ఆ వివరాలను ప్రభుత్వం సమర్పించాలి.
4. కూల్చివేతలకు ముందు సంబంధిత అధికారి చట్టప్రకారం భవన యజమానికి నోటీసు ఇవ్వాలి కదా? నోటీసు ఇవ్వకుండా కూల్చివేయొచ్చా? ఏ అధికారం కింద కూల్చివేస్తారు? నోటీసు ఇవ్వాలి. ఆక్రమణదారుల, అనధికార నిర్మాణదారుల హక్కుల పత్రాలను ప్రాథమిక పరిశీలన చేయాల్సిందే.