TG High Court | గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బకాయిలపై తెలంగాణ విద్యుత్‌శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని ఎస్పీడీసీఎల్ నోటీసులు పంపింది. 2008 నుంచి ఇప్పటి వరకు రూ.118కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే, ఎస్పీడీసీఎల్ నోటీసులను గీతం యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, యూనివర్సిటీ దాఖలు చేసిన జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్ 2008 నుంచి బిల్లులు చెల్లించకపోవడంతోపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు రూ.1000 బిల్లు కట్టకపోతేనే కరెంట్ కనెక్షన్‌ను తొలగిస్తున్నారని.. అలాంటిది యూనివర్సిటీకి మాత్రం ఎందుకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించారని ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని.. సూపరింటెండెంట్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.