హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో చట్ట వ్యతిరేకంగా కల్లు అమ్మకాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. కల్లు విక్రయాలకు చర్యలు తీసుకోవడం లే దని రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన బాలరాజ్ దాఖలు చేసిన పిల్ ను గురువారం హైకోర్టు విచారించింది. ఇదే తరహాలో మరో పిల్ కూడా విచారణలో ఉన్నదని అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ గుర్తుచేశారు.
రెండింటినీ కలిపి విచారణ చేపడతామన్న హైకోర్టు, ప్రతివాదులైన ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డి ప్యూటీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్గదర్శి వివరాలు ఉండవల్లికి ఇవ్వండి
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టుకు మార్గదర్శి సమర్పించిన వివరాలు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు పెన్‌డ్రైవ్ లో ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో ఆదేశించిన మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎందుకు కౌం టర్లు దాఖలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. డిసెంబర్ 20 లోగా కౌంటర్లు వేయాలని రెండు రాష్ట్రాలతోపాటు ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసిం ది. విచారణను జనవరి 3కు వాయిదా వేస్తూ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నా మవరపు రా జేశ్వర్రావు ధర్మాసనం తీర్పునిచ్చింది.