హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానను గోషామహల్ స్టేడియంకు తరలించడానికి గల కారణాలేమిటో తెలియజేయాలని, ఆ నిర్ణయం అమలుపై నివేదిక అందజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఉస్మానియా దవాఖాన తరలింపునకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది.