హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేస్ కాలనీలో ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ సెంటర్లో 13 కార్డుల రమ్మీ/సిండికేట్ గేమ్స్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
తమ రిక్రియేషన్ సెంటర్లో రమ్మీని అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యేస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి.. సీఎస్, హోం, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, డీజీపీ, నగర పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీచేసింది.