మార్గదర్శి కేసు.. ఏపీ అధికారులకు హైకోర్టు నోటీసులు
కోర్టు ధికరణ కేసులో ఏపీ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్, దాని ఎండీలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మార్చి 21న జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు అధికారులు ఉల్లంఘించారని హైకోర్టు భావించింది.
- విచారణ ఆగస్టు 14కు వాయిదా
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికరణ కేసులో ఏపీ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్, దాని ఎండీలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మార్చి 21న జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు అధికారులు ఉల్లంఘించారని హైకోర్టు భావించింది. దీంతో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు ఎస్పీలు రాజశేఖర్‌రావు, సీహెచ్ రవికుమార్, అదనపు డీజీపీ సంజయ్‌కి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది.
కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు తనకు వ్యతిరేకంగా లుక్ఔట్ నోటీసులు జారీ చేయడమే కాక మార్గదర్శి ఆస్తులను జప్తు చేశారని పేరొంటూ ఆ సంస్థ ఎండీ చెరుకూరి శైలజ, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లు పిటిషన్లను దాఖలు చేసిన దరిమిలా శుక్రవారం విచారించిన జస్టిస్ కే సురేందర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

