Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. లగచర్ల దాడి ఘటనలో ఏ1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి.. కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. లగచర్ల ఘటనలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరారు.
పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు దాన్ని తిరస్కరించింది. బెయిల్ పిటిషన్పై కింది కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.