హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ సహా దేశంలోని 11 రాష్ర్టాల హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 21 మందిని బదిలీచేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. జస్టిస్ సుజయ్‌పాల్ కోల్‌కతాకు బదిలీ అయ్యారు. గతంలో తెలంగాణ హైకోర్టులో పనిచేసి కర్ణాటక, బీహార్‌కు బదిలీ అయి న ముగ్గురు న్యాయమూర్తులు తిరిగి తెలంగాణ హైకోర్టుకు రానున్నారు. జస్టిస్ సీ సుమలత, జస్టిస్ కన్నెగంటి లలిత కర్ణాటక హైకోర్టు నుంచి, జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డి పాట్నా హైకోర్టు నుంచి తిరిగి రానున్నారు.
ఏపీ క్యాడర్‌కు చెందిన జస్టిస్ కన్నెగంటి లలిత గతంలో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు, ఆ తర్వాత కర్ణాటకకు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆమె మళ్లీ తెలంగాణకే రానున్నారు. ఇదే విధంగా ఏపీ నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ భట్టు దేవానంద్ తిరిగి ఏపీకి రాబోతున్నారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ బీఆర్ గవాయ్ అధ్యక్షతన ఈ నెల 26న జరిగిన కొలీజియం సమావేశం ఈ బదిలీల విషయమై కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.