నిందితులను కఠినంగా శిక్షించాలి
హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌పై జరిగిన దాడిని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.
- హైకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్‌పై జరిగిన దాడిని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని శనివారం ఓ ప్రకటనలో పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో తన నివాసం నుంచి బయటికి వెళ్లేందుకు కారు ఎకబోతున్న మొయిజుద్దీన్‌ను మరో కారులో వచ్చిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మొయిజుద్దీన్‌ను వెంటనే దవాఖానకు తరలించడంతో అకడ చికిత్స పొందుతూ మరణించారని అసోసియేషన్ వివరించింది. దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరగా అరెస్టు చేయాలని డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌ను డిమాండ్ చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
నిందితుల తరఫున వాదించొద్దు..
మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదురొంటున్న ముజాహిద్ ఆలమ్ ఖాన్, మహబూబ్ ఆలమ్ ఖాన్ తరఫున తెలంగాణలోని న్యాయవాదులు ఎవరూ వాదించవద్దని ‘అడ్వకేట్స్ ఫర్ జస్టిస్’ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇది న్యాయ సహాయం హకును నిరాకరించడం కాదని, న్యాయవాదులపై దాడి చేసినట్టు ఆరోపణలు ఎదురొంటున్న వారు బార్ వెలుపల న్యాయ సహాయం పొందాలనే సామూహిక నైతిక వైఖరి మాత్రమేనని ఆ సంస్థ అధ్యక్షుడు అదిల్ అలీ మీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

