ఆఫ్ క్యాంపస్ అనుమతులను పునఃసమీక్షించండి.. కాంగ్రెస్ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు..
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో ఆఫ్ క్యాంపస్ అడ్మిషన్లకు అనుమతినిచ్చే విషయమై పునఃసమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. చట్టంలోని అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఆఫ్ క్యాం పస్ అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
- ఏదో ఒక కారణం చెప్పి తిరస్కరించడం చెల్లదు
- చట్ట ప్రకారం సరైన నిర్ణయం తీసుకోవాలి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో ఆఫ్ క్యాంపస్ అడ్మిషన్లకు అనుమతినిచ్చే విషయమై పునఃసమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. చట్టంలోని అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఆఫ్ క్యాం పస్ అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావుతో కూడిన ధర్మాస నం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆఫ్ క్యాంపస్‌లో బీటెక్ కోర్సుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సమర్థి స్తూ సింగిల్ జడ్జి గతంలో తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ, వాహిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్, స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కాలేజీలు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు దేశా య్ ప్రకాశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులు, డాటాసైన్స్, ఏఐఎంఎల్ తదితర కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కింద నిర్వహించుకోవడానికి ఏఐసీటీఈ అనుమతి మం జూరు చేసిందని, ప్రభుత్వం మాత్రం నిరాకరిస్తున్నదని తెలిపారు.
దీంతో కౌన్సెలింగ్‌లో అడ్మిషన్లు ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వం పక్షాన ప్రత్యేక న్యా యవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆఫ్ క్యాంపస్ కాలేజీల ఏర్పాటు నిమిత్తం మా ర్గదర్శకాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమి టీ జూన్ 11న సమావేశం నిర్వహించిందని తెలిపారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రారంభమైన ఈ దశలో ఆఫ్ క్యాంపస్‌లకు అడ్మిషన్లు అనుమతించడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఈ అంశాన్ని వచ్చే ఏడాది పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కోర్టుకు వచ్చిన కాలేజీలకు మాత్రమే కాకుండా ఏ ఇ తర కాలేజీలకు కూడా ఆఫ్ క్యాంపస్‌ల నిర్వహణకు అనుమతి మంజూరు చేయలేదని చె ప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఏఐసీటీఈ అనుమతుల మంజూరు చేయకముం దు వివరణ అడిగినప్పుడు సకాలంలో స్పం దించవచ్చు కదా అని ప్రశ్నించింది. ఏదో ఒక కారణం చూపుతూ అనుమతులను తిరసరించడం చెల్లదని పేరొంది. ఏకవాక్య తీర్మానం తో కాలేజీల దరఖాస్తులను తిరసరించరాద ని, తిరసరణకు కారణాలను పేరొనాలని స్ప ష్టంచేసింది. దరఖాస్తులను పరిశీలించి ని ర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

