హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యేలే పంపిణీ చేయాలని హైకోర్టు స్పష్టంగా చెప్పిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు మెట్టికాయల తర్వాతైనా ప్రభు త్వం అరాచకాలు ఆపాలని సూచించారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెకులు పంపిణీ చేయనివ్వటంలేదని కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. కోర్టు స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేయవచ్చని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. జీవోను ఫాలో కావాల్సిందే అ ని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రి పొన్నం పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని గనుల వే లానికి కేంద్ర గనులశాఖ విధించిన గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభు త్వం కోరనున్నది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తున్నది. రా ష్ట్రంలోని 11 గనుల్లో ఈ నెల 30 లోగా కనీసం ఆరింటికైనా వేలం నిర్వహించాలని గడువు నిర్ణయించింది. గనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే తమ ఆధిపత్యాన్ని కోల్పోయే అవకా శం ఉన్నదని భావిస్తున్న ప్రభు త్వం.. గడువు పెంచాలని, ప్రభుత్వరంగ సం స్థలకే కేటాయించాలని లేఖలో కోరాలని భావిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఢిల్లీ నుంచి రాగానే గనులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ నెల 21న వాణిజ్య మైనింగ్ కోసం పదో దఫా వేలాన్ని కేంద్రం ప్రారంభించింది. దీనికి కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ అంశం.. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ దుమారానికి వేదికైంది.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరును పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకే పరిమితం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 12 తరగతుల్లోని విద్యార్థులకు ఈ హాజరును తప్పనిసరి చేసింది. ఈ మేరకు సమగ్రశిక్ష అధికారులు ఇటీవలే ఆదేశాలను జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కాని వి ద్యార్థులనూ నమోదు చేయాలని సూచించింది. దీనిని నూరుశాతం అమలుకు చొరవ తీసుకోవాలని, హాజరును రోజువారీగా పర్యవేక్షిస్తామని ప్రకటించింది. గతంలో 2023లో టీచర్లకు ఇదే హాజరు విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నించింది. కానీ టీచర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ హాజరు విధానాన్ని ఉపాధ్యాయులకు అమలుచేస్తే వారి నుంచి మళ్లీ వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన సర్కారు తాజాగా ఎఫ్ఆర్ఎస్ హాజరును విద్యార్థులకే పరిమితం చేసినట్టు తెలిసింది.
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): టీచర్ల పదోన్నతుల్లో భాగంగా ముందు ఒక సబ్జెక్టుకు పదోన్నతులు కల్పించిన తర్వాతే మరో సబ్జెక్టులో పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఒకే ఉపాధ్యాయుడు రెండు మూడు పదోన్నతులు పొందారని, దీంతో కొంతమంది టీచర్లకు పదోన్నతులు లభించలేదని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ప్రధానకార్యదర్శి రాజుగంగారెడ్డి తెలిపారు. దీనికి పరిష్కారంగా ఒక సబ్జెక్టుకు పదోన్నతి కల్పించి ఆ తర్వాతే మరో సబ్జెక్టుకు చేపట్టడం ఉత్తమమని సూచించారు. అదేవిధంగా, ఒక పోస్టుకు పదోన్నతి పొందిన తర్వాత ఆయా టీచర్‌ను పదోన్నతులు కల్పించే జాబితా నుంచి తొలగించాలని తెలిపారు.
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో దాదాపు 50 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. నిల్వ ఉంచిన బియ్యం కావడంతో భోజనంలో పురుగులు వస్తున్నాయని మధ్యాహ్న భోజన కార్మికులు తెలిపారు. పాఠశాల సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు భోజనాన్ని ఇంటి నుంచి తెచ్చుకొంటున్నారు.
– నర్సాపూర్(జి)
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : వరదలు, భారీ వర్షాల నుంచి బాధితులను రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. వరదల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు నిజామాబాద్ నుంచి భద్రాచలం వరకు.. గోదావరి పరీవాహంలో రెస్క్యూ బోట్లతో అగ్నిమాపకశాఖ మోహరించనుందని వెల్లడించారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో బోట్స్ తో పాటు నీటిని తోడే పంప్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్లు ఇతర రెస్క్యూ సామగ్రితో సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. కొత్తగా ‘ఆపదమిత్ర’ పేరుతో ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో 109 మంది ఆపదమిత్రలకు శిక్షణ ఇప్పించామన్నారు.
ఇల్లెందు రూరల్, జూన్ 27: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జ్ఞానం మరిచి ప్రవర్తించాడు. దేవాలయం లాంటి పాఠశాలలో విద్యార్థులను దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన గురువారం భద్రాది జిల్లా ఇల్లెందులో చోటుచేసుకుంది. ఇల్లెందు మండలంలోని ఇల్లెందులపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కా ల్వ సుధాకర్.. గురువారం మద్యం మత్తు లో పాఠశాలకు వచ్చాడు. తరువాత తరగతి గదిలో విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపై వారిని దుర్భాషలాడాడు. వి ద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఆ ఉపాధ్యాయుడిని తరగతి గది లో నిర్బంధిం తాళం వేశారు. అతడిపై కాంప్లెక్స్ హెచ్ఎం యాదమ్మ కు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం వచ్చి నిర్బంధంలో ఉన్న ఉపాధ్యాయుడిని విడిపించారు.