హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : గతంలో అక్రెడిటేషన్ కార్డులు పొందిన అర్హులైన వరింగ్ జర్నలిస్టుల పాత కార్డుల గడువును అక్టోబర్ 1వరకు పొడిగించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. కొత్తగా కార్డులు కోరుతున్న వారికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాబితాలోని 535 మందిలో 268 మందికే గతంలో అక్రెడిటేషన్ కార్డులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న పనివేళలతోపాటు ఉపాధ్యా యులకు అప్పగిస్తున్న బోధనేతర విధులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.