హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆమె వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ ఒక ప్రకటనలో తెలిపింది. జేఏసీ ప్రతినిధి బృందం మంగళవారం కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లగా దుర్భాషలాడారని జేఏసీ నేతలు వాపోయారు. జీవో-97, పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే విషయంపై తాము చర్చించేందుకు వెళ్లగా హుందాగా వ్యవహరించలేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఇన్స్పైర్ మానక్ నామినేషన్ల గడువును అక్టోబర్ 10 వరకు పొడగించినట్టు ఎస్సీఈఆర్టీ అధికారులు తెలిపారు. 2026 -27 విద్యాసంవత్సరానికి పోటీపడే వారు ఆయా గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.