హైదరాబాద్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో నిర్మించిన ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో 2026-27 విద్యాసంవత్సర అడ్మిషన్లు తమ తుది తీర్పునకు లో బడి ఉంటాయని హైకోర్టు సోమవారం తేల్చి చెప్పిం ది. అంతేగాకుండా అకడ అడ్మిషన్లు తీసుకోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సొంత రిస్పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నది. విద్యాసంస్థ అనధికా ర నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లో వ్యతిరేక ఉత్తర్వులు జారీ అయితే అప్పుడు వారు ఎలాంటి హ కులూ కోరలేరని స్పష్టం చేసింది. ఇదే విషయం వి ద్యార్థులకు తెలియజేయాలని సూచించింది.
సలం చెరువును ఆక్రమించి నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ విజయగోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్ర వణ్కుమార్ విచారణ చేపట్టారు. హైదరాబాద్ పరిధిలో 26 చెరువులు ఉండగా సలం చెరువుకు మా త్రం తుది నోటిఫికేషన్ జారీ చేయకపోవడంపై ఆశ్చ ర్యం వ్యక్తంచేశారు. ఎఫ్టీఎల్ గుర్తించేందుకు సర్వే చేసి, అనధికార నిర్మాణాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. శాటిలైట్ ఆధారాలు పరిశీలిస్తే చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టున్నదని, విద్యార్థులు చేరే ముందు ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. చెరువులో తదుపరి నిర్మాణాలకు అనుమతించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. విచారణను 30వ తేదీకి వాయిదా వేశారు.