హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని 13వ తేదీ సోమవారం హైకోర్టు నుంచి కింది కోర్టుల వరకు సెలవు ప్రకటిస్తూ గురువారం హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, ట్రిబ్యునల్, లేబర్, కిందిస్థాయి కోర్టులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పారు.
12న ఆదివారం దీపావళి రావడం.. సోమవారం కూడా హైకోర్టు సెలవు ప్రకటించడంతో మంగళవారం కోర్టు విధులు పునఃప్రారంభమవుతాయి.