జనవరిలో రెండు దఫాలుగా 5,800 కోట్లు, ఫిబ్రవరి 4న 3,000 కోట్లు, మార్చి 4న మరో 2,000 కోట్ల్ల రుణాలను సమీకరించింది. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఆర్బీఐ నుంచే రూ.66,827 కోట్ల అప్పు తీసుకున్న రేవంత్ సర్కారు.. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా కార్పొరేషన్లు/ఎస్పీవీల నుంచి మరో రూ.61,991 కోట్లు, ఎ లాంటి గ్యారంటీ ఇవ్వకుండా 10,099 కోట్లు, టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వ భూ ములను తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరో 10 వేల కోట్లు పొందింది.
దీంతో రేవంత్ సర్కారు తెచ్చిన మొత్తం అప్పులు రూ.1,48,917 కోట్లకు చేరా యి. అయినప్పటికీ రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టును చేపట్టకపోవడం, నూత న పథకాలేమీ అమలు చేయకపోవడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.