హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం ఆ పార్టీ తెలంగాణను నిధిగా మార్చుక్నుదని ఎక్స్‌వేదికగా ధ్వజమెత్తారు. ‘మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు తెలంగాణ నుంచి వందల కోట్లు వరదలా ప్రవహిస్తున్నాయి’ అని అనురాగ్‌రెడ్డి చేసిన ట్వీట్‌కు ఆయన ఇలా బదలులిచ్చారు. ఇటీవలి హర్యానా ఎన్నికల్లో, ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్నదని ఆరోపించారు.
ఉద్యోగుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి…
కాంగ్రెస్ పాపపు పాలనలో రాష్ట్రంలోని ప్రతీ బిడ్డా ఆగమేనని కేటీఆర్ పేర్కొన్నారు. సామాన్యులు మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాకులతో సస్పెన్షన్లు, హకులు అడిగితే వేటు వేయడమే పాలనగా కొనసాగుతున్నదని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు, ఉన్న ఉద్యోగాలను రేవంత్ సర్కార్ ఊడగొడుతున్నదని విమర్శించారు. 165 మంది ఏఈవోలు, 20మంది కానిస్టేబుళ్లను ప్రభు త్వం సస్పెండ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని, కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు అండగా ఉన్నామని గుర్తుచేశారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిషరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.