హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ)/కరీంనగర్ కార్పొరేష న్: బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకూ కాస్మెటిక్ చార్జీలను, ఇతర వసతులను కల్పిస్తున్నట్టు బీసీ సం క్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు ప్రభుత్వం ఏటా రూ.12 కోట్లను అదనంగా వెచ్చించనున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాస్మెటిక్తోపాటు బెడ్డింగ్ మెటీరియల్, ఉలన్ బ్లాంకె ట్స్, నోట్‌బుక్స్ అందజేస్తూ ఉత్తర్వులను జారీ చేశామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీ మెట్రి క్ హాస్టల్ విద్యార్థుల తరహాలోనే వీరికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. తద్వారా 302 హాస్టళ్లలోని 34 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నదని చెప్పారు. బీసీల విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. 327 బీసీ గురుకులాల ఏర్పా టు, 703 హాస్టళ్లు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫీజుల చెల్లించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. బీసీల సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి విశేష కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.