12 కోట్లతో ఆరు ఠాణాల నిర్మాణం
శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులపై దృష్టి పెడుతున్నది. నగర, పట్టణ ప్రాంతాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అత్యాధునిక వసతులతో పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నది
5న ప్రారంభం: కోలేటి దామోదర్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులపై దృష్టి పెడుతున్నది. నగర, పట్టణ ప్రాంతాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అత్యాధునిక వసతులతో పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నది. ఇందుకు భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి, కౌటాల, చింతలమానేపల్లి, పెంచకల్‌పేట, రెబ్బెన, కాగజ్‌నగర్ రూరల్ ప్రాంతాల్లో రూ.12 కోట్లతో పోలీస్‌స్టేషన్ భవనాలు నిర్మించారు. వీటిల్లో వాంకిడి, కౌటాల, చింతలమానేపల్లి, పెంచకల్పేటల్లో ఒక్కొక్కటి రూ.2.50 కోట్లతో భవనాలను నిర్మించారు. రెబ్బన, కాగజ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ భవనాలను రూ.2 కోట్లు వెచ్చించి నిర్మించారు. రూ.50 లక్షలతో నిర్మించిన కాగజ్‌నగర్ రూరల్ సర్కిల్ కార్యాలయం కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది.
సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం ఈ భవనాలు
మారుమూల జిల్లాల్లో, రాష్ట్ర సరిహద్దుల్లో కోట్లు వెచ్చించి ఠాణాలకు అత్యాధునిక భవనాలు నిర్మించడం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించిన ఆరు ఠాణాలను ఈ నెల ఐదున ప్రారంభించనున్నాం.
– కోలేటి దామోదర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

