ములుగు రూరల్, మే 18 : కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించే క్రమంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతినడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసినట్టు పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. తడిసిన ధాన్యా న్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొంటామని ప్రకటించారు. ఇక నుంచి రైతుల పంటకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.