ఆర్టీసీలో సమ్మె నోటీసుపై సమావేశం
తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్టీసీలో సమ్మె నోటీసుపై యూనియన్ల నేతలు సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆర్టీసీలో సమ్మె నోటీసుపై యూనియన్ల నేతలు సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి జేఏసీ ప్రతినిధులు సుద్దాల సురేశ్, కమలాకర్ గౌడ్, రాఘవులు, టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు, బీఎంఎస్ నాయకుడు మనోహర్, ఎన్ఎంయూ అధ్యక్షుడు కమల్‌రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి జకుల మల్లేశ్, ఎస్టీఎంయూ ప్రధాన కార్యదర్శి పీ హరికిషన్ సమ్మె నోటీసు, తదనంతర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మిగిలిన ఆరు యూనియన్ల జేఏసీ నేతలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని వారు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

