హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ హరించుకుపోతున్న అడవి, పెరుగుతున్న కాంక్రీట్ జంగల్.. వాహన, పారిశ్రామిక కాలుష్యాల వల్ల అస్తవ్యస్తమైన జీవావరణం. భూభాగంలో 33 శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించడం. ఈ నేపథ్యాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమంగా హరితహారం కార్యక్రమాన్ని రూపొందించి, అమల్లోకి తెచ్చారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించి, అడవుల శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి కార్యక్రమాలు కూడా ఒక ఉద్యమంలా సాగుతున్నాయి.