నీలగిరి, ఫిబ్రవరి 09 : ఈ నెల 11న జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో నల్లగొండ 8వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి చిన్నాబత్తిని జ్ఞానసుందరమ్మ జయప్రకాశ్ ఓటర్లను కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని లుయిజ్నగర్, చైతన్యపుర కాలనీ, గణేష్ నగర్, అక్కలాయిగూడెంతో పాటు పలు కాలనీల్లో ఆమె కార్యకర్తలతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించి ఓటేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ హయాంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణం అన్నిరకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఓపెన్ డ్రైన్లను నిర్మించి లో ఓల్టేజీ సమస్యను సైతం తీర్చామన్నారు. అర్హులందరికి పింఛన్లు అందజేయడం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిన్నాబత్తిని బయప్రకాశ్, కాలనీ నాయకులు పోలే శ్రీను, మారగోని శంకర్, కారింగ్ నరేష్, ఎలగమల్ల ప్రభాకర్, ఎం.సునీల్ విజయరాణీ, శాంతమ్మ పాల్గొన్నారు.

‘అభివృద్ధిని చూసి కారు గుర్తుపై ఓటేసి గెలిపించండి’