అర్వపల్లి, ఫిబ్రవరి 09 : ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా తెరిచి బ్యాంకులు అందించే సేవలను వినియోగించుకోవాలని అర్వపల్లి మండల రామన్నగూడెం సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్యాంకుల ద్వారా అందే సేవలు, జీవిత బీమా, ఖాతాదారులు పొందే లాభాలపై కళాకారులు బుర్రకథ రూపంలో వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ నెమలికొండ, ఉప సర్పంచ్ లింగంపల్లి రవీందర్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.