Sharad Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్ (Sharad Pawar) అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బారామతి నుంచి పుణెలోని రూబీ హాల్ క్లినిక్ ఆస్పత్రి (Ruby Hall Clinic Hospital) కి తీసుకెళ్లారు. దగ్గు, జలుబుతో ఆయన బాధపడుతున్నారని, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇటీవల శరద్‌పవార్ తమ్ముడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అజిత్ మరణంతో ప్రస్తుతం ఆయన భార్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా శరద్‌పవార్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Maharashtra: NCP-SCP chief Sharad Pawar brought to Ruby Hall Clinic Hospital in Pune from Baramati after his health deteriorated.
His office says that he has some complaints of cough and difficulties in breathing. pic.twitter.com/SPBTGivnBo
— ANI (@ANI) February 9, 2026