Telangana | హైదరాబాద్ : తెలంగాణకు మరో 5 జాతీయ అవార్డులు( National Awards ) వచ్చాయి. 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకు తోడుగా, తాజాగా మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు లభించాయి. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహ్రా ప్రకటించారు. దీంతో కేంద్రం ప్రకటించిన పుసర్కారాలలో మొత్తం 13 పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఏప్రిల్ 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందజేస్తామని, సంబంధిత ప్రతినిధులను ఒక రోజు ముందుగా పంపించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.