హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు సాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు సంబంధించిన ప్రజాహిత వ్యాజ్యంలో ఉన్నత విద్యామండలి, సాంఘిక సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు పిటిషనర్లకు సూచించింది. విద్యార్థులకు సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేరొంటూ అసీమ్ (అసోసియేషన్ ఫర్ సోషియో ఎకనమిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది మార్జినలైజ్డ్), స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లను కళాశాలలు ఇవ్వడం లేదని తెలిపారు. దీనిపై అదనపు అడ్వకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ స్పందిస్తూ, బకాయిల పేరుతో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయరాదని కళాశాలలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంకా రూ.125 కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఈ వ్యవహారం వివిధ శాఖల పరిధిలోని విద్యాసంస్థలకు సంబంధించినదైందున ఆయా శాఖలు కూడా కేసులో ప్రతివాదులుగా ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు చెప్పింది. సంబంధిత శాఖలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లకు సూచించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.