Inter Board | ఇంటర్ విద్యతో సర్కార్ ఆటలు!.. రెండేండ్లలో ఎన్నో సర్కస్ ఫీట్లు.. పిల్లల ఆటలా ప్రభుత్వ నిర్ణయాలు
Inter Board | ఇంటర్మీడియట్.. విద్యార్థి జీవితానికి గేట్‌వే. ఉన్నత విద్యకు మలుపు లాంటిది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటర్ విద్యతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతున్నది. అస్తవ్యస్త నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తున్నది.
Inter Board | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్.. విద్యార్థి జీవితానికి గేట్‌వే. ఉన్నత విద్యకు మలుపు లాంటిది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఇంటర్ విద్యతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతున్నది. అస్తవ్యస్త నిర్ణయాలతో గందరగోళం సృష్టిస్తున్నది. ఇంటర్ విద్య విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు పిల్లలాటను తలపిస్తున్నది. తాజాగా ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనంచేసేందుకు ప్రయత్నించి, ఆదివారం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది.
సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని, ఇప్పటికిప్పుడు వీలుపడదని తేల్చేసింది. ఇదొక్కటే కాదు.. అనేక విషయాల్లోనూ కాంగ్రెస్ సర్కార్ ఇలాగే చేసింది. ఈ రెండేండ్లలో ఇంటర్ విద్యను సర్కార్ ప్రయోగశాలగా మార్చేసిందన్న ఆరోపణలున్నాయి. ముందు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత యూటర్న్ తీసుకోవడం సర్కార్‌కు రివాజుగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రిగా ఉండగా గందరగోళం నెలకొనడంపై విద్యారంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
పలు నిర్ణయాలు ఇలా..
- ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఈ నెల 4న ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఒక రోజు వ్యవధిలోనే షెడ్యూల్‌ను నిలిపివేసింది. మళ్లీ పాత విధానంలోనే అడ్మిషన్లు స్వీకరించనున్నట్టు తెలిపింది.
- రాష్ట్రంలో 10+2 విద్యావిధానం రద్దుకు ప్రయత్నించింది. ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేసేందుకు కసరత్తు చేసింది. ఆర్డినెన్స్ జారీ చేసేందుకు అన్ని రకాల కసరత్తు చేసింది. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదన్న భావనతో ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.
- 2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్ సిలబస్‌ను అధికారులు మార్చారు. ఇది సర్కార్ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. మా అనుమతి లేకుండా సిలబస్ ఎలా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి సిలబస్ మార్పునకు బ్రేక్ వేశారు.
- 2026-27 విద్యా సంవత్సరంలో సిలబస్ మార్పు కోసం ముందుగానే ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. సిలబస్‌ను ఖరారు చేశారు. ఇప్పుడు పాత, కొత్త సిలబస్‌కు తేడాలేంటో చెప్పాలంటూ మెలికపెట్టారు.
- ఇంటర్లో అన్ని సబ్జెక్టులకు థియరీ, ప్రాక్టికల్స్‌కు 80-20 విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కానీ ఇంతవరకూ స్పష్టత లేదు.
- రాష్ట్రంలోని సర్కార్ కాలేజీల్లోని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ ఏటా ఆలస్యమవుతున్నది. ఈ విద్యాసంవత్సరం దసరా తర్వాతే కొన్ని కాలేజీలకు పుస్తకాలు అందాయి. తెలుగు అకాడమీకి భారీ బకాయిలతో సంస్థ పుస్తకాలు సరఫరా చేయలేకపోతున్నది.
- జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ)ని జాతీయంగా కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది. కానీ, తెలంగాణలో మాత్రం ఎన్ఈపీ అమలుకు, ఇంటర్‌బోర్డును పాఠశాల విద్యలో విలీనానికి పావులు కదిపింది.
- రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నది. విద్యా కమిషన్ పబ్లిక్ స్కూల్స్ అంటున్నది.
ఒక్కొక్కరిది ఒక్కో మాట..
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత సర్కార్ సీరియస్‌గా స్పందించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇంటర్‌బోర్డు ఇంకా రద్దు కాలేదా..? మేం రద్దు చేయమని చెప్పాక తాత్సారమెందుకు? అని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారట. ఇదిలా ఉంటే కొందరు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇటీవలే ప్రభుత్వ సలహాదారు, ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావును కలిశారు. ఎన్ఈపీ అమలుపై స్పష్టత, కాలేజీలకు బోర్డు విధించిన జరిమానాలను రద్దుచేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేకే, ఇంకెక్కడి ఇంటర్‌బోర్డు. బోర్డును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నం కదా.. అంటూ వ్యాఖ్యానించారట. ఇంటర్‌బోర్డును రద్దుచేస్తే ఇబ్బందులు తప్పవని కాలేజీ యాజమాన్యాలు హెచ్చరించాయట.
ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి..
నిజానికి ఇంటర్‌బోర్డును రద్దు చేయాలంటే అసెంబ్లీలో కొత్తగా చట్టం చేయాలి. లేదా ఆర్డినెన్స్ జారీచేయాలి. అయినా బోర్డు రద్దు కాలేదా? అంటూ సర్కార్ పెద్దలు అధికారులను ప్రశ్నించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా ఇటీవలే ఇంటర్‌బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యను సర్కార్ బదిలీ చేసింది. కొత్త సెక్రటరీగా అభిలాష అభినవ్‌ను నియమించింది. బోర్డు రద్దు అయితే కొత్త సెక్రటరీని ఎందుకు నియమించినట్టు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

